
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమాల్లో ‘లాల్ సలామ్’ ఒకటి. ఆయన కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తుండగా, రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పొంగల్ పోటీలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉండగా, ఇప్పుడు ఈ రేసులోకి రజినీకాంత్ కూడా రావడం ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించనున్నారు. జీవితా రాజశేఖర్, క్రికెటర్ కపిల్ దేవ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.